Wednesday, January 29, 2025

ఏఎన్‌ఎంల ధర్నాకు మద్దతు తెలిపిన జడ్పీ చైర్‌పర్సన్

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, జడ్పీచైర్‌పర్సన్ సరితతిరుపతయ్య మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగంలో అగ్రగామిగా నిలవడంతో ఏఎన్‌ఎంల సేవలు కీలకమన్నారు. చాలీచాలని వేతనాలతో గత 16 ఏళ్లుగా నేషనల్ హెల్త్ మిషన్‌లో రెండవ ఏఎన్‌ఎంలుగా పని చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్న రెండో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న రెండో ఏఎన్‌ఎంలను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా డిస్ట్రిక్ సెలక్షన్ కమిటి ద్వారా ఎంపికైన వారికి ఎలాంటి రాత పరీక్షలేకుండా రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు విద్యావతి, కృష్ణవేణి, భారతీ, పద్మా, నవీన,జ్యోతి, పరిమళ, లక్ష్మీ,నర్మద, సుగున్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News