Wednesday, January 22, 2025

తిరుగబడు- తరిమికొట్టు కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం మల్దకల్ మండల పరిధిలోని అమరావాయి గ్రామంలో తిరుగబాడు _తరిమికొట్టు కార్యక్రమంలో భా గం గా అసెంబ్లీ కో ఆర్డీనేటర్ జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ ఆధ్వర్యంలో అమరావాయి గ్రామంలోని పురవీధులలో తిరిగి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం, తెల్లరేషన్ కార్డు, పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు.

అక్కడక్కడ చేరికలు ఏర్పాటు చేసిన వేదికల వద్ద వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సరితమ్మ సమక్షంలో చేరారు. గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడాక్కడా అభిమానం చూపిస్తూ మహిళలు పూలమాలలు వేసి సన్మానించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒకేసారి 2 లక్షల రుణ మాఫి, మొదటి విడతలో 2 లక్షల ఉద్యోగల భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు,రేషన్ కార్డు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యశ్రీ, గ్యాస్ 500 తదితర సంక్షేమ పథకాలు అందరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, అమరావాయి కృష్ణఆరెడ్డి, గట్టు కృష్ణ, రేపల్లె కృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, మల్లేందొడ్డి మద్దిలేటి, రాఘవేంద్రరెడ్డి,తిమ్మప్ప, మధు, పూడూర్ ఈశ్వర్‌నాయుడు, ఇమ్మానేయిల్ , భాస్కర్‌రెడ్డి, ఎల్కూర్ నర్సిములు, బాలు, తిమ్మప్ప, మహబూబ్, ఆంజనేయులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News