Friday, January 10, 2025

బాధిత కుటుంబాలకు జడ్పిటిసి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

శివ్వంపేట: శివ్వంపేట మండల కేంద్రానికి చెందినపలువురు బాధిత కుటుంబాలైన అంతముల లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆమెను పరామర్శించిన మెదక్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు ప్రముఖ సంఘ సేవకులు శివ్వంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆమెకు ఆర్థిక సాయం చికిత్స నిమిత్తం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన కములయ్య గారి సురేష్ ప్రమాదవశాత్తు చెయ్యి ప్యాక్చర్ కావడం వల్ల అతని పరామర్శించి అతనికి చికిత్స నిమిత్త ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన ముయ్యడి పెంటయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని అతనికి పరామర్శించి అతనికి ఆర్థిక సాయం నగదు 8000 వేల రూపాయలు అందచేశారు.

జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, మాట్లాడుతూ ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి నా యొక్క సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ రాజపేట పద్మ వెంకటేష్, వార్డ్ సభ్యులు పోచగౌడ్, వంజరి కొండల్ పంభాల సంతు ముయ్యడి సింహం గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాల లక్ష్మీనరసయ్య, నాయకులు దొడ్ల అశోక్, పత్రాల దేవేందర్ గౌడ్, దావూద్ యాదగిరి, ఖదీర్, వర గంటి రమేష్, గొల్ల మహేష్, గుర్రాల కుమార్, త్రినేష్ గౌడ్, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, సందీప్, మహేష్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News