Sunday, January 19, 2025

నిందితులను పట్టుకునేంతవరకు జడ్పిటిసి అంతక్రియలు చేయము..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : గుజ్జకుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం చేర్యాల జడ్పీటిసి మల్లేశం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  నిందితులను పట్టుకునేంతవరకు మల్లేశం అంతక్రియలు చేయమని బంధువులు ఆందోళన చేశారు. జడ్పీటిసి హత్య కేసులో అనుమానితులు సత్తయ్య ఇంటి దగ్గర బందువులు ఆందోళనకు దిగారు. సత్తయ్య, చంద్రకాంత్ ఇంటి అద్దాలను పగలకొట్టారు. కారు, బైకులు ధ్వంసం చేశారు. నిందితులను తమకు అప్పగించాలని లేదంటే అంతక్రియలు జరపబోమని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News