Thursday, December 26, 2024

వరినారుతో కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పాలకుర్తి మండలం లింగాపూర్ గ్రామంలో జడ్పిటిసి కందుల సంధ్యారాణి ఇండ్ల నరేష్ స్వప్న పొలంలో మంత్రి కెటిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని అక్కడి రైతులతో కలిసి వినూత్న రీతిలో ఆదివారం కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సోమవారం జరుపుకోనుండగా పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్‌డే కెటిఆర్ అని ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రైతులు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే అది సిఎం కెసిఆర్ ముందు చూపేనన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజా దీవెనలు అందుకుంటున్న కెటిఆర్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరోజ, శారద, భాగ్య, శ్యామల, అమీన, విజయ, రమ, లచ్చమ్మ, సత్తమ్మ, సరోజన, సునీత, హరీష్, ప్రశాంత్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News