న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బైడస్ సంస్థ రూపొందించిన ‘విరాఫిన్’ ఔషధాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) ఆమోదించింది. అత్యవసర వినియోగానికి అనుమతి పొందినట్లు జైడస్ కాడిలా శుక్రవారం ప్రకటించారు. కోవిడ్-19 ప్రారంభంలో రోగులు వేగంగా కోలుకోవడానికి, చాలా సమస్యలను నివారించడానికి విరాఫిన్ సహాయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశం అంతటా 20-25 కేంద్రాలలో నిర్వహించిన మల్టీసెంట్రిక్ ట్రయల్ లో, విరాఫిన్ అనుబంధ ఆక్సిజన్ అవసరం తక్కువగా చూపించిందని కంపెనీ అధికారులు తెలిపారు. కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడుతూ … “తాము ఒక చికిత్సను అందించగలుగుతున్నామని, ఇది ప్రారంభంలో ఇచ్చినప్పుడు వైరల్ లోడ్‌ను గణనీయంగా తగ్గిస్తుందని, ఇది రోగులకు చాలా అవసరమైన సమయంలో పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.