Thursday, January 23, 2025

అక్రమ కేసులకు భయపడేది లేదు: భూమి రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని ఎంఎల్‌సి భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు అల్లర్ల సందర్భంగా టిడిపి నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని భూమి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వంలో కదలిక తీసుకరావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారన్నారు. వైసిపోళ్లు దాడులు చేస్తే తమపై కేసులు పెడతారా? అని భూమి రెడ్డి నిలదీశారు. దాడుల్లో పోలీసులే సాక్ష్యంగా ఉన్నారని, వారికి కూడ దెబ్బలు తగిలాయన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు, తాము ధైర్యంగా విజయనగరంలో ఉన్నామని, ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని భూమి రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: 9వ తరగతి బాలికను లైంగికంగా వేధించి… తుపాకీతో కాల్చారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News