గుజరాత్‌లో అమూల్ పాల ధర రెండు రూపాయలు పెరిగింది. శనివారం నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్ మార్కెట్లలో పెరిగిన అమూల్ పాల ధరలు అమలు కానున్నాయి. అమూల్ గోల్ట్ అరలీటరు (500ఎంఎల్) రూ.32, అమూల్ స్టాండర్డ్ రూ.29, అమూల్ తాజా రూ.26, అమూల్ టీ స్పెషల్ 500ఎంఎల్ రూ.30గా కొత్త ధరలును జిసిఎంఎంఎఫ్ పేర్కొంది. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత గుజరాత్‌లో అమూల్ పాల ధరలు పెంచడం ఇదే ప్రథమం.
బిజెపి 182స్థానాల్లో రికార్డుస్థాయిలో 156స్థానాలు గెలుచుకుని విజయం సాధించిన అనంతరం మళ్లీ భారం పడేలా పాల ధరలు పెరగడం గమనార్హం. గతేడాది జిసిఎంఎంఎఫ్ చివరిసారి అమూల్ పాల ధరలను లీటరకు రెండు రూపాయలు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న జిసిఎంఎంఎఫ్ గుజరాత్ మినహా అన్ని మార్కెట్లలోనూ లీటరు పాల ధరపై రూ.2అదనంగా పెంచింది. ప్రతిరోజూ సగటున జిసిఎంఎంఫ్ 264లక్షల లీటర్ల పాలును సేకరిస్తోంది. గుజరాత్‌లోని చెందిన 36లక్షల మంది పాడి రైతులు జిసిఎంఎంఎఫ్‌కు పాలను అందిస్తున్నారు.