Friday, January 31, 2025

అవే మాకు ప్రచార అస్త్రాలు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

వనపర్తి: పదేళ్ల రాష్ట్ర విజయాలే బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచార అస్త్రాలు అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరంజన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి, మేనిఫెస్టో హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో వనపర్తి వందేళ్ల భవిష్యత్‌కు బాటలు వేశామని, 64 మినీ ఎత్తిపోతల పథకాలతో మిట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్నామని, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ మత్య, వ్యవసాయ కళాశాలలను తీసుకొచ్చామని నిరంజన్ రెడ్డి వివరించారు. ప్రతిష్ఠాత్మకంగా ఐటి టవర్‌ను నిర్మించుకోబోతున్నామని, ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించుకున్నామని నిరంజన్ రెడ్డి చెప్పారు. చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

Also Read: మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కుట్రకోణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News