న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్ విడుదల చేసింది. ఇకపై జుమ్లాజీవి (బూటకపు హామీదారుడు),బాజ్‌బుద్ధి (కొద్దిబుద్ధి), కొవిడ్ స్ప్రెడర్ (కొవిడ్ వ్యాప్తి చేస్తున్నవాడు) స్నూప్‌గేట్ వంటి పదాలతోపాటు ఎషేమ్డ్ (సిగ్గుమాలినతనం), ఎబ్యూజ్డ్ (దుర్భాష), బిట్రేయ్డ్ (విద్రోహం), కరప్ట్ (అవినీతి), డ్రామా (నాటకం), హిపోక్రసీ(అతిశయం), నియంత అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొనడమైంది. జుల్ 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. తాజా జాబితా ప్రకారం శకుని, తానాషా, అనార్కిస్టు (అరాచకవాది), వినాశ్‌పురుష్ (వినాశకారి), ఖలిస్థానీ, చీటర్(మోసకారి), ద్రోహచరిత్ర, జైచంద్ (ద్రోహి), చంచాగిరి, నికమ్మా (దద్దమ్మ), బేహ్రీ సర్కార్ (చెవిటి ప్రభుత్వం), పిరికివాడు, క్రిమినల్, క్రోకడైల్ టియర్స్ (మొసలికన్నీళ్లు), డాంకీ(గాడిద ), అసమర్ధుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, బ్లడ్‌షెడ్ (రక్తపాతం), విశ్వాసఘాతకుడు, వంటి పదాలను సభ్యులు తమ ప్రసంగాల్లో ఉపయోగించరాదు. ఈ పదాలు ఉపయోగిస్తే సభాధ్యక్షులు వాటిని కూడా అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణించి తమ విచక్షణ మేరకు రికార్డుల నుంచి తొలగిస్తారని కూడా బుక్‌లెట్‌లో పేర్కొన్నారు.
ఇక నుంచి ఈ పదాలపై పార్లమెంట్‌లో నిషేధం..
- Advertisement -
- Advertisement -
- Advertisement -