Tuesday, December 24, 2024

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఐటి ఉద్యోగి చైన్‌స్నాచింగ్ చేసిన ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చైన్, రెండు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాండూరుకు చెందిన దివాటే ప్రశాంత్, గొల్ల జనార్దన్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు గచ్చిబౌలిలోని ఐడిబిఐలో పనిచేస్తున్నారు. ప్రశాంత్ ఐడిబిఐలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తుండగా, జనార్దన్ మెస్‌లో పనిచేసేవాడు. ప్రశాంత్‌కు నాంపల్లి ఐడిబిఐకి బదలీ కాగా, జనార్దన్ పనిమానేసి, హెచ్‌సియూ ఎదుట ఉన్న ఎస్‌బిఐలో హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా చేరాడు.

Also Read: భూ వివాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురిని కాల్చి చంపారు..

కొద్ది రోజుల తర్వాత ఇద్దరు పనిమానివేశారు. ఇద్దరు మద్యం తాగే అలవాటు ఉండడంతో డబ్బులు దొరకడంలేదు. ఈ క్రమంలోనే ఆదిబట్లలోని టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి గత నెల 27వ తేదీన విధులు ముగించుకుని గచ్చిబౌలిలోని హాస్టల్‌కు చేరుకునేందుకు టిసిఎస్ వద్ద బస్సు దిగింది. అనంతరం వెనుక గేట్ నుంచి హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు నిందితులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని చైన్‌ను లాక్కుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. డిఐ రవీందర్ కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News