Monday, December 23, 2024

ఈ బ్యాంకుల్లో మీకు క్రెడిట్ కార్డు ఉందా?

- Advertisement -
- Advertisement -

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో నేటి నుండి మార్పులు వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం..యుటిలిటీ లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల పరిమితిని బ్యాంక్ నిర్ణయించింది. ఇది కాకుండా..నేటి నుండి థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఎడ్యుకేషనల్ పేమెంట్ చేయడంపై యూజర్లు ఎటువంటి రివార్డ్ పాయింట్‌లను పొందలేరు.

ప్రైవేట్ రంగ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల నియమాలలో కూడా నేటి నుండి మార్పులు వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. ఇది కాకుండా..ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు రోజులను 18 నుండి 15 రోజులకు తగ్గించింది.

అంతేకాకుండా..ఇక నుండి UPI చెల్లింపు కోసం RuPay క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌లకు సమానమైన రివార్డ్ పాయింట్‌లను పొందలేరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News