Monday, December 23, 2024

ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జివో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. మధ్యాహ్నం పలు దఫాలుగా ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో ఉదయం 8గంటల నుంచే భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పంజాగుట్ట, సోమాజీగూడ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేస్తు ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు.

317జీఓ వల్ల ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆదేవన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకోవాలని, జీఓకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉపాధ్యాయుల ముట్టడి వల్ల పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్ పరసరాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News