Saturday, December 21, 2024

ఎయిర్‌హోస్టెస్‌ను వేధించిన మందుబాబు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : ఆదివారం దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఎయిర్‌హోస్ట్‌స్‌ను వేధించిన నేరంపై పోలీస్‌లు ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.ఇండిగో విమానం 6 ఈ 1428 లో రాజిందర్ సింగ్ అనే ప్రయాణికుడు మద్యం మత్తులో ఓ ఎయిర్‌హోస్టెస్‌పై అనుచితంగా ప్రవర్తించాడు.

ఈ విమానం ఆదివారం రాత్రి 8 గంటలకు అమృత్‌సర్‌లో దిగగానే పోలీస్‌లు ఆయనను అరెస్టు చేశారు. నిందితుడు రాజిందర్ సింగ్ పంజాబ్ లోని జలంధర్, కోట్లి గ్రామస్థుడని వెల్లడైంది. పోలీస్‌లు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News