Monday, December 23, 2024

ఎస్.ఎన్.డి.పి పనులతో సత్ఫలితాలు వస్తాయి : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ఎస్.ఎన్.డి.పి పనులతో సత్ఫలితాలు ఉంటున్నాయని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గతరెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఉదయం 6 గంటలకు గడ్డిన్నారం డివిజన్ వివేకనందనగర్, కొదండ రామనగర్ కాలనీలలో కాలనీవాసులతో కలసి శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకనందననగర్ కాలనీలో జరుగుతున్న పైప్‌లైన్ పనులు దగ్గర చెత్తా చెదారం తట్టడం జరిగిందని, దీంతో మురుగునీరు కాలనీలోకి పోంగి పొర్లడం జరిగిందన్నారు.

వరద ప్రవాహం తగ్గడానికి గేట్లు తెరవడం జరిగిందని తెలిపారు. అనంతరం గేటుమూసి వేసి, సరూర్‌నగర్ చెరువులో మూడోగేటు ఏర్పాటు చేశామని, ఈ గేటుతో వివేకనందనగర్, కొదండ రామ్‌నగర్‌ల ముంపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి జరిగియాని, ప్రణాళికబద్ధ్దంగా పూర్తి చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News