Monday, December 23, 2024

కళాక్షేత్ర ఫౌండేషన్ ఫ్యాకల్టీ సభ్యుడు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆర్ట్ అండ్ కల్చరల్ అకాడమీ పూర్వ విద్యార్థినిని లైంగికంగా వేధించినందుకు చైన్నైలోని కళాక్షేత్య ఫౌండేషన్ ఫ్యాకల్టీ మెంబర్‌ హరి పద్మన్ ను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అధ్యాపక సభ్యునిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354ఎ, 509, తమిళనాడు మహిళా వేధింపుల చట్టం కింద పూర్వ విద్యార్థి శుక్రవారం ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. తమిళనాడు రాష్ట్ర మహళా కమిషన్ చీఫ్ ఎ.ఎస్.కుమారి కూడా సోమవారం ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కళాక్షేత్ర ఫౌండేషన్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను శుక్రవారం కలిసినప్పుడు దాదాపు వంద ఫిర్యాదులు అందాయని కుమారి తెలిపారు.

తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని, లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం నుంచి తమ నిరసనను ప్రారంభించారు.

సోమవారం అరెస్టయిన అధ్యాపకుడే విద్యార్థులు పేర్కొన్న మొదటి వ్యక్తి. ఆరోపణలలో నిజం లేదని మార్చిలో కళాక్షేత్ర ఫౌండేషన్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ పేర్కొంది. ఈ అంశాన్ని రాష్ట్ర శాసనసభలో లేవనెత్తాక చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేస్తూ కళాక్షేత్ర ఫౌండేషన్ విద్యార్థులు గతవారం నిరసన ప్రదర్శించారు.

Hari Padman

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News