Monday, December 23, 2024

కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

కురుమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డిని ఆహ్వానించిన నాయకులు

మన తెలంగాణ / ఘట్‌కేసర్: కురుమ సంఘం ఆధ్వర్యంలో కీసర గుట్టపై ఏర్పాటు చేసిన కార్తిక వన భోజనాల కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మంగళవారం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చీర సురేష్ కురుమ, ప్రధాన కార్యదర్శి గొంగళ్ళ బాలేష్ కురుమల ఆధ్వర్యంలో తదితర నాయకులు కలసి ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి అహ్వానించారు. మేడ్చల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13 ఆదివారం నాడు కీసర గుట్టలో ఏర్పాటు చేసిన కార్తిక మాస వన భోజనాలకు ఈ మేరకు అహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్రి కాశయ్య, కౌడే మల్లేష్, చీర శేఖర్, ఒగ్గు శంకర్, కౌడే శ్రీశైలం, చీర వినోద్, మేకల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మల్లారెడ్డి తో కలసి ప్రత్యేక అభిషేకం పూజలో పాల్గొన్న పోచారం మున్సిపాలిటీ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్
పోచారం: కార్తిక మాసం సందర్భంగా కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొంగళ్ళ బాలేష్‌లు మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి ప్రత్యేక పూజలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News