- Advertisement -
అమరావతి: సంక్రాంతి పండుగకు హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల నుండి భారీగా ప్రయాణికులు తరలి వెళ్తున్నారు. అదే విధంగా విజయావాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. పండుగ రద్దీ దృష్ట్యా 1,370 ప్రత్యేక బస్సులను ఎపి ఎస్ఆర్ టిసి సంస్థ ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ బైపాస్ రోడ్డులో వాహనాల రవాణాకు ప్రభుత్వం అనుమతించింది. విజయవాడ నగరం మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. గొల్లపూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర చిన అవుటుపల్లి మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వాహనాలు వెళ్తున్నాయి. 30 నిమిషాల్లో విజయవాడను వాహనాలు దాటుతున్నాయి.
- Advertisement -