Sunday, January 5, 2025

గర్ల్‌ఫ్రెండ్‌ హత్య ..వాట్సాప్‌లో మృతదేహం ఫోటో పోస్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై : చెన్నైలో ఒక హోటల్‌లో ఇరవై ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ అయిన నర్సింగ్ విద్యార్థినిని ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన బయటపడింది. అంతేకాదు నిందితుడు వాట్సాప్‌లో ఆమె మృతదేహాన్ని పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మృతురాలి స్నేహితులు బాయ్‌ఫ్రెండ్ ఆషిక్ వాట్సాప్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీస్‌లను అప్రమత్తం చేశారు. పోలీస్‌లు రంగం లోకి దిగి వారిద్దరూ బసచేసిన హోటల్ రూమ్‌ను తెలుసుకున్నారు. మృతురాలు నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని. నిందితునితో గత ఐదేళ్లుగా ఆమెకు పరిచయం సాగుతోంది. ఇటీవలనే వీరిరువురు గది అద్దెకు తీసుకుని కలిసి సహజీవనం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆమె కాలేజీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు ఆరా తీయగా, బాయ్‌ఫ్రెండ్ ఆషిక్ చెన్నైకి వచ్చాడని, హోటల్ రూమ్ తీసుకుని వారు ఉంటున్నారని తెలిసింది.

అయితే ఆషిక్ వాట్సాప్‌లో ఆమె మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీస్‌లు గాలించి ప్రైవేట్ హోటల్‌లో విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ ఏరియా లోని సిసిటివి ఫుటేజి పరిశీలించి నిందితుడు ఆషిక్‌ను అరెస్టు చేయగలిగారు. దర్యాప్తులో నిందితుడు తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీస్‌లు చెప్పారు. నిందితుడు ఆషిక్ మరో యువతితో సంబంధం పెట్టుకోవడంపై ఇరువురి మధ్య వాగ్వాదం సాగి చివరకు ఆమె గొంతు నులిమి చంపివేసినట్టు బయటపడింది. ఆషిక్ తన టీ షర్టుతో ఆమె గొంతు నులిమి చంపాడని పోలీస్‌లు తెలిపారు. వీరిద్దరికీ ఇదివరకే ఆడపిల్ల సంతానం కలిగిందని, ఆమెను దత్తతకు ఇచ్చారని పోలీస్‌ల విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News