Monday, December 23, 2024

గుజరాత్‌లో గోడకూలి నలుగురు పిల్లల మృతి

- Advertisement -
- Advertisement -

హలోల్ : గుజరాత్ పంచమహల్ జిల్లాలో గురువారం ఉదయం భారీ వర్షాలకు పాడుబడిన ఫ్యాక్టరీ గోడ కూలి తాత్కాలిక టెంట్లపై పడడంతోఐదేళ్ల వయసున్న నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిరిరామ్ దామోర్ (5), అభిషేక్ భూఏరియా ( 4), గున్‌గున్ భూరియా ( 2) ముస్కన్ భూరియా (5)గా గుర్తించారు. బాధితులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకు చెందిన వారు. హలోల్ తాలూకా చంద్రపుర గ్రామంలో మూతపడిన రసాయన ఫ్యాక్టరీ సమీపాన నిర్మాణాలు జరుగుతుండడంతో పనిచేయడానికి వచ్చారు.

ఫ్యాక్టరీ ప్రహరీ గోడకు ఆనుకుని తాత్కాలికంగా శిబిరాలు వేసుకుని ఉంటున్నారని డిస్టిక్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాంశు సోలంకీ చెప్పారు. భారీ వర్షాలకు ఈ ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఐదుగురు పిల్లలు అక్కడికక్కడే చనియారు. గాయపడిన ఐదుగురిని హలోల్ ఆస్పత్రికి తరలించారు. గుజరాత్ లోని గత 36 గంటల్లో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజులూ భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. వల్సాద్ జిల్లా పర్డీ తాలూకా లో గత 36 గంటల్లో 182 మిమీ వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News