Friday, January 24, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

‘ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం’

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని హుడా పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం ఒక శుభ పరిణామం అని, రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అని అన్నారు. సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం నిరంతరం ప్రజల్లో తీసుకెళ్లి రేపటి తరాలకు వీటి ఫలాలు అందేలా పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం అని, ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం రాములు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News