Tuesday, November 26, 2024

చైనాలో 996కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ ఉద్యమం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: అమెరికా సహా అనేక దేశాలలో ఒకవైపు ‘ద గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం కొనసాగుతుంటే, మరోవైపు చైనాలో 996 వర్క్ కల్చర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ ఉద్యమం మొదలయింది. 996 కల్చర్ అంటే… ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు పనిచేయడం. దీన్నే అక్కడ 996 వర్క్ రూల్ అంటున్నారు. అదో వర్క్ సిస్టమ్‌గా తయారయింది. చైనాలో ఉద్యోగులపై పనిభారం ఎకువ అన్నది ఇక్కడ గమనార్హం. సాధారణంగా కంపెనీ నిబంధనల ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.

చైనాలో ఈ ఆన్‌లైన్ ఉద్యమాన్ని ఎవరో తెలియని నలుగురు మొదలెట్టారు. వారు తమను తాము ఇటీవలే గ్రాడ్యుయేషన్ చేసిన వారిగా పేర్కొన్నారు. వారు “వర్కర్ లైవ్స్ మ్యాటర్‌” అనే ప్రచారాన్ని మొదలెట్టారు. వారు కంపెనీ పేరు, పొజిషన్, పనిగంటలు వగైరా వివరాలను ‘గిట్‌హబ్’లో పోస్ట్ చేయమని కోరారు. దాంతో అలీబాబా గ్రూప్, బైదు ఇన్‌కార్పొరేషన్, టెన్‌సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, బైట్ డ్యాన్స్‌లో తాము ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నట్లు 4000 కంటే ఎక్కువ మంది గురువారం ఉదయం పోస్ట్‌చేశారు. ఐటి రంగమేకాకుండా రియల్ ఎస్టేట్, ఫినాన్స్, ఫారిన్ కంపెనీ వంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం వేరేగా ప్రత్యేక స్ప్రెడ్‌షీట్లు రూపొందించారు. స్ప్రెడ్‌షీట్‌లో వివరాలు ఎంట్రీ చేసినవారంతా తాము వారానికి 5 రోజలు, రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

చైనాలో ప్రస్తుతం అధిక పనిగంటలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుకనే అక్కడ 996 కల్చర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలెట్టారు. ఆ కల్చర్‌ను 955కు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో కొత్తగా చేరాలనుకునే వారికి కంపెనీ పనివేళలు తెలిపే సమాచారం(డేటాబేస్) కావాలంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News