Wednesday, January 22, 2025

జనసేనకు రూ.కోటి విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన పార్టీకి ఆ ఆపార్టీ ఎన్‌ఆర్‌ఐ సభ్యుల బృందం కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. నా సేనకోసం ..నావంతు కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఈ మొత్తం విరాళాన్ని గురువారం చెక్కు రూపంలో పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు అందజేశారు.

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, ఆస్ట్రేలియా ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్తలు రాజేష్ మల్లా,కొలికొండ శశిధర్‌పాటు జనసేన నాయకులు ఉదయ్ శ్రీనివాస్, జగదీష్ హరిదాస్ , జ్ణానేశ్వర్‌రావు, చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News