Thursday, January 23, 2025

ఉద్యోగులకు డిఏ విడుదల చేసిన సిఎంకు ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / నాంపల్లి : ఉద్యోగులకు 2.73 శాతం కరువు భత్యం (డిఏ)ను 1 జనవరి 2022 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయడాన్ని టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. వేల మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చినందుకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్‌లు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. డిఏ ల విడుదలలో సహకరించిన రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి టి. హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News