Saturday, December 21, 2024

త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట

- Advertisement -
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుధవారం గురుపూర్ణిమ సందర్భంగా ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వశిష్ఠ్ మాట్లాడుతూ “మా ట్రైలర్‌కు విశేషమైన స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్, అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన శ్రీమణి, పాడిన కాళ భైరవకు థ్యాంక్స్. ఈ పాట అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా బింబిసారుడి త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట ఇది. ఇలాంటివి ఇంకా వస్తాయి. కర్మ సిద్దాంతాన్ని ఆధారంగా ఈ పాట నేపథ్యాన్ని తీసుకున్నాం. బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు”అని అన్నారు. సంగీత దర్శకుడు చిరంతన్ మాట్లాడుతూ “గురుపూర్ణిమ సందర్భంగా ఈ పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. ఈశ్వరుడే అనే ఈ పాట కర్మ చుట్టూ తిరుగుతుంది. దీన్ని కంపోజ్ చేయడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ శ్రీమణి పాల్గొన్నారు.

Eeswarude Lyrical Song Out from Bimbisara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News