Wednesday, January 22, 2025

నవధాన్యాలతో 12 అడుగుల భారీ గణపతి చిత్రం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమా జం వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామరాజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయకుల చిత్రాలను ప్రతి సంవత్సరం ఎన్నో రకాలు గా చిత్రించి తన భక్తిని చాటుకుం టూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా వినూతనంగా 12 అడుగుల భారీ గణపతి చిత్రాన్ని నవ దాన్యాలతో 3 రోజులు శ్రమించి అత్యద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించి తన అపారమైన భక్తిని చాటుకున్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరోకటి లేదని, ఎన్నో భగవంతుని చిత్రాలను ఎన్నో రకాలుగా చిత్రించానని అన్నారు. నవ ధాన్యాలతో 12 అడుగుల భారీ చిత్రం చిత్రించడం ఆ భగవంతుని కృపేనని అన్నారు.భక్తుల సందర్శనార్ధం రామకోటి కార్యాలయంలో ఈ చిత్రం ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.

భక్తులు నవ ధాన్యాల గణపతి చిత్రం తిలకించి భక్తి పారవశ్యానికి లోనయ్యారని తెలిపారు.స్వయంగా గణనాథుడే దిగి వచ్చాడా అని భక్తులు ఆనందాన్ని వెలిబుచ్చినట్లుగా ఆయన తెలిపారు.రామకోటి రామరాజు భక్తికి భక్తులు ప్రత్యేకంగా అభినందించారు.గత సంవత్సరం 5 రకాల పప్పు దినుసులతో గణపతి చిత్రాన్ని చితించానని తెలిపారు.ఆసక్తి కల వారు ఈ చిత్రాన్ని తిలకించాలని ఈ సందర్భంగా ఆయన భక్తులను కోరారు.గత 19 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను ఉచితంగా అందిస్తున్న రామకోటి రామరాజు… రామకోటి రామరాజు గత 19 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను స్వయంగా తయారు చేసి భక్తితో వేలాది మంది భక్తులకు అందజేస్తున్నారు.20 మంది మొదలుకొని నేడు వేలాది మంది భక్తులకు మట్టితో చేసిన గణపతులను అందజేయడం జరుగుతుంది. భక్తులు స్వయంగా రామరాజు ఇంటికి వచ్చి మట్టి గణపతులను తీసుకువెళుతున్నారు. వారికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే వాతావరణ కాలుష్యాన్ని వివరించి అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News