Friday, January 10, 2025

నీట మునిగి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ (గుజరాత్): గుజరాత్ లోని బోట్రాడ్ పట్టణంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు నీట మునిగి మృతి చెందారు. అక్కడి కృష్ణాసాగర్‌లో ఈత కొట్టడానికి ఇద్దరు బాలురు వెళ్లి నీట మునిగి పోయారు. వారి కేకలు విని అక్కడే ఉన్న ముగ్గురు వారిని రక్షించడానికి నీటిలో దూకారు. అయితే వారు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పోలీస్‌లు ప్రమాదస్థలానికి చేరుకుని ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల వయసు 1617 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్పీ కిశోర్ బలోలియా చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News