- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆదివారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో 200 బెడ్ల సామర్థ్యం కలిగిన ఈ భవనాన్ని ఆదివారం ఉదయం 11.15 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కార్పోరేట్‌కు ధీటుగా గాంధీలో మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ భవనంలో అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని, ఫలితంగా గర్భిణులకు వెంటనే వైద్యసేవలు అందితే ప్రసూతి మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. మూడు బ్లాకులు, ఏడు ఫ్లోర్లతో 200 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించామని, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒపి, ఒపి ల్యాబ్, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, ప్రసవ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
- Advertisement -