Friday, December 20, 2024

పిచ్చాసుపత్రిలో గోవింద్‌కు ట్రీట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మద్యం మత్తులో మతిస్థిమితం లేక ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గోవింద్ కు  పోలీసులు  ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన గోవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతనికి 2014 నుంచి నుండి మతిస్థితిమితం సరిగ్గా లేనట్లుగా గుర్తించారు. గత కొంతకాలంగా మందులు వాడుతున్నన ఆయన ఈ మధ్య కాలంలో మoదులు వాడటం ఆపివేయడంతో మళ్లీ మతిస్థిమితం తప్పి రోడ్లపై తిరుగుతున్నట్లు గురించారు. ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు గోవింద్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News