పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్‌లో ‘కింగ్ ఆఫ్ క్లే’ రాఫెల్ నాదల్ 6-3, 6-1, 6-4తో కొరెంటిన్ మౌటెట్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో తన కెరీర్లో 300వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విజయాన్ని సాధించాడు.
రాఫెల్ నాదల్ తన 300వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విజయాన్ని సాధించడానికి బుధవారం అద్భుతమైన ప్రదర్శనను చూపాడు, ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌లో తన స్థానాన్ని బుక్ చేసుకోవడానికి అక్కడి స్థానిక ఆటగాడు అయిన కొరెంటిన్ మౌటెట్‌ను 6-3 6-1 6-4 తేడాతో ఓడించాడు.
నాదల్ తన మొత్తం 21 మేజర్లలో 13 రోలాండ్ గారోస్ టైటిళ్లను గెలిచాడు. ఇది పురుషుల ఆటలో అత్యధికం.అతడు గాయపడినప్పటికీ తన మొదటి రెండు రౌండ్లను చాలా సాధారణంగా ఆడగలిగాడు. పైగా క్లేకోర్టులో మంచి ప్రదర్శనను చూపాడు. శుక్రవారం బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌తో తలపడనున్న నాదల్, ఇటీవలి గాయం ఆందోళనల తర్వాత తాను ఆరోగ్యంగా ఉన్నట్లు సూచించాడు.
Most Grand Slam Singles wins of all-time (male):
369 – Federer
325 – Djokovic
300 – Nadal 👏
233 – Connors
224 – Agassi@RafaelNadal #RolandGarros pic.twitter.com/zeDQ04DSj4— Tennis TV (@TennisTV) May 25, 2022