Wednesday, January 22, 2025

బంగాళాఖాతంలో దానా తుపాన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / అమరావతి : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాటికి తుఫానుగా మారనుంది. కాగా ఈ తుఫానుకు ఐఎండీ దానా గా నామకరణం చేసింది. దానా తుఫాను ప్రభావం వల్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్,

సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సోమవారం తూర్పు- మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం తూర్పు- మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు అదే ప్రాంతంలో వాయుగుండంగా ఏర్పడినట్లు పేర్కొంది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి అటు తరువాత

ఇది ఈ నెల 23న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24న ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా ఉద్ధృతి చెంది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాన్ని 24వ తేది రాత్రి లేదా 25న ఉదయం పూరి, సాగర్ ఐలండ్స్ మధ్య దాటే అవకాశం ఉం దని తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశం లేదని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News