Monday, December 23, 2024

బడుగు, బలహీన వర్గాల వారికి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల వారికి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసిల్దార్‌లతో జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 58, 59 కింద తీసుకున్న దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలన పూర్తి చేయాలన్నారు.

ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి జిల్లాలోని 8 మండలాల్లో గతంలో గుర్తించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్, మైనార్టీ సంక్షేమ అధికారి పులి మధుసూదన్, సర్వే ల్యాండ్ రికార్డు అధికారి అశోక్, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News