అమరావతి: నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీ చేసి రిపోర్టు ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. రాంబాబు మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పారు. టిడిపి ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతోందన్నారు. మానవ తప్పిదంతోనే డ్రయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని వెల్లడించారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. డయాఫ్రమ్ వాల్‌కు ఇరువైపులా గోతులు ఏర్పడ్డాయని, గుంతలు పూడ్చేందుకు 78 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని, దీని కోసం రెండు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలని, ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని వివరించారు. ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్టు పోలవరం అని ప్రశంసించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పిదమే కారణమని అంబటి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంబటి దుయ్యబట్టారు. దెబ్బతిన్న భాగాలను రిపేర్ చేసేందుకు అధికారులు డిజైన్ తయారు చేస్తున్నారని వివరించారు. డిజైన్ తరువాత పనులు మొదలవుతాయని