Tuesday, November 5, 2024

బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలిక కిడ్నాప్ కేసును బహదుర్‌పుర పోలీసులు ఐదు గంటల్లో ఛేదించారు. బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, బహదుర్‌పురకు చెందిన నసీం బేగం, ఆయేషా బేగం ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నసీం బేగంకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం అయి పిల్లలు అయ్యారు. కానీ పెద్ద కూతురు ఆయేషా బేగంకు పిల్లలు పుట్టలేదు.

దీతో నసీం బేగం ఈ నెల 25వ తేదీన కిషన్‌బాగ్ పార్క్‌లో ఏడాదిన్నర బాలికను కిడ్నాప్ చేసింది. బాలికను తీసుకుని వచ్చి కూతురికి అప్పగించింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి కూతురు ఉంటున్న నావాబ్‌సాహెబ్ కుంటకు ఆటోలో బయలు దేరారు. వీరిని పోలీసులు తాడ్‌బన్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు బహదుర్‌పుర పోలీసులు మూడు టీములగా ఏర్పడ్డారు. పోలీసులు దాదాపుగా 100 సిసి కెమెరాలు పరిశీలించారు. డిఐ శ్రీశైలం, ఎస్సైలు శ్రీకాంత్, బిక్షం, మల్లారెడ్డి, నర్మద తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News