- Advertisement -
ఆసిఫాబాద్ రూరల్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, తేదేపా నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జిల్లాలో చాలా మంది ఇతర పార్టీల నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని, 10 అసెంబ్లీ సీట్లలో భారీ మెజార్టీతో గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి, బిఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -