Monday, December 23, 2024

భయాందోళనలు తొలగించేందుకే ఆకస్మిక తనిఖీలు

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : ప్రజలను మూఢనమ్మకాలు, ఆచారాలపై ఉన్న భయాందోళనలను అపోహలను తొలగించేందుకే గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముథోల్ సీఐ వినోద్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పి ప్రవీణ్ కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్‌ల ఆదేశాల మేరకు ఏఎస్పి కిరణ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాలలో రాత్రి వేళల్లో అనుమానిత వ్యక్తులు దొంగతనాల కోసం సంచరిస్తున్నారని అసాంఘిక కార్యక లాపాలు కొనసాగుతున్నాయన్న ఉద్దేశ్యంతో ప్రజలలో భయం పొగొట్టడానికి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఇందులో సరైన పత్రాలు లేని 4 కార్లు, 77 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను పట్టు కున్నామని పెండింగ్‌లో ఉన్న 40 వాహనాల చలాన్‌లు 35,400 రూపాయలు కట్టించినట్లు పేర్కొ న్నారు. అలాగే గ్రామాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించినా, బాల్యవివాహాలు, మం త్రాలు చేతబడులు సైబర్ నేరాలు నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మడం లాంటి తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే 100 కు పోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు జి. సాయికుమార్, వినోద్, మహేష్, సాయికిరణ్, ఏఎస్‌ఐ , కానిస్టేబుల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News