Tuesday, January 7, 2025

భర్తల మరణ శాసనం రాస్తున్న భార్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యానికి బానిసగా మారిన భార్యలను భర్తలు వేదించడంతో పాటు వాళ్ల వికృత చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో భర్తలను భార్యలు హత్య చేస్తున్నారు. మద్యం మత్తులో చాకు చేతిలో పట్టుకొని భార్యను భర్త చంపడానికి ప్రయత్నించాడు. భార్య కర్ర తీసుకొని భర్త తలపై బాది అనంతరం కిందపడిన తరువాత గొంతుకు తాడి చుట్టి హత్య చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తపాలెం పంచాయతీ గోకర్ణమఠం గ్రామంలో అమరేంద్రబాబు(38), అరుణ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉంది. అమరేంద్ర మద్యానికి బానిస కావడంతో భార్యను పలుమార్లు వేధింపులకు గురి చేశారు.

అతడి వేధింపులకు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అమరేంద్ర మద్యం ఫుల్‌గా తాటి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. చాకు చేతిలో పట్టుకొని భార్యను పొడవడానికి ప్రయత్నించాడు. వెంటనే భార్య కర్ర తీసుకొని భర్త తలపై మోదింది. అతడి మెడకు తాడు కట్టి నడి రోడ్డుపైకి లాక్కొచ్చింది. గొంతుకు తాడి బిగించి ఉరి పెట్టింది. భర్త చనిపోయాడని తెలుసుకున్న తరువాత ఆమె అక్కడి నుంచి పారిపోయింది. ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు పరారీలో ఉందని పోలీసులు వెల్లడించారు.
రెండో రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో భార్య పడక సుఖం ఇవ్వడంలేదని కూతురుపై తండ్రి లైంగిక దాడికి ప్రయత్నించాడు. కోపంతో రగిలిపోయిన భార్య భర్తను చంపి అనంతరం ముక్కలు ముక్కలు నరికి పొలంలో పడేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News