Sunday, December 22, 2024

భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం

- Advertisement -
- Advertisement -

పదవులు కోల్పోయిన భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్

నేరేడుచర్ల మున్సిపాలిటీ హస్తగతం
సంబరాల్లో అపశ్రుతి, బాణసంచా పేలుడులో ఒకరికి తీవ్ర గాయాలు

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి/నేరేడుచర్ల: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మున్సిపల్ చైర్మ న్, వైస్ చైర్మన్, సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసాలు నెగ్గాయి. మెజార్టీ కౌన్సిలర్లు హాజరు కావడంతో.. చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యలపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో వారిద్దరూ తమ పదవులను కోల్పోయారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లు, ఎక్‌అఫీషియో సభ్యుడు (ఎంఎల్‌ఎ కుంభం అనీల్ కుమార్ రెడ్డి) సమావేశానికి రావాల్సి ఉండగా.. 31 మంది హాజరయ్యారు. చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్ట య్య, మరో ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. చై ర్మన్, వైస్ ఛైర్మన్లకు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతుగా 31 మంది చేతులెత్తారు. నిబంధనల ప్రకారం కోరం (31) సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.

అదేవిధంగా సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చం దమళ్ళ జయబాబుపై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో మొత్తం 16 మంది ఉండగా అవిశ్వాస సమావేశానికి చైర్మన్ చందమళ్ళ జయబాబు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు గైర్హాజరయ్యారు. 13 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదించడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో తెలిపారు.ఇదిలావుండ గా, అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పా ర్టీ నెగ్గడంతో ఆ పార్టీ శ్రేణులు జరుపుకు న్న సంబురాలలో అపశృతి నెలకొంది. మండల కేంద్రానికి చెందిన అరిగెల రవి అనే కాంగ్రెస్ కార్యకర్త బాణసంచా కాల్చుతూ ప్రమాదవశాత్తు చేతిలో బాంబు పేలడంతో చేతికి తీవ్రంగా గాయపడగా, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Nereducherla

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News