Tuesday, December 24, 2024

 మరోసారి సమ్మెబాట పట్టనున్నా బ్యాంకు ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుండి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యుఎఫ్‌బియు) నిర్ణయించినట్లు ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఎఐబిఈఎ) వెల్లడించింది. గురువారం ముంబైలో జరిగిన యుఎఫ్‌బియు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్ల పై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోడంతో

తమ ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో(సోమ, మంగళారాల్లో) సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించామని ఎఐబిఈఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం ఐఎఎన్‌ఎస్‌కు తెలిపారు. ముఖ్యంగా ఐదురోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్‌డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్ల చార్టర్‌పై తక్షణ చర్యలు, అన్నివిభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్లతో ఈసమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News