Thursday, December 19, 2024

మా తాత నాతోనే ఉన్నారు: దగ్గుబాటి అభిరాం

- Advertisement -
- Advertisement -

మూవీ మొఘల్ గా, తెలుగులో అత్యధిక సినిమాలు చేసి, అనేక ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిన్న మనవడు దగ్గుబాటి అభిరామ్ ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్న దగ్గుబాటి రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియ‌ర్ టాలీవుడ్ నిర్మాత‌, ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్, నిర్మాత కం ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి, నిర్మాత బాలరాజు, నిర్మాత అంకమ్మరావు  పాల్గొన్నారు.

తనకు ఎంతో ఆప్తులైన తాతయ్యకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత దగ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ ‘’అందరికీ నమస్కారం ఈరోజు తాత గారి తొమ్మిదవ వర్ధంతి అయితే నాకు ఆయన దూరమయ్యారని ఇప్పటికి అనిపించడం లేదు. ఈ రోజుకి ఆయన నాతోనే ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆయనను చూస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది, నాకు చిన్నప్పటి నుంచి ఆయనే లోకం నన్ను హీరోగా చూడాలని ఆయన ఎంతో తపించారు, తాత నీ కలను నేను సాధించాను, నీ ఆశీర్వాదం కావాలి, నేను మీరు గర్వపడేలా చేస్తాను. నాకు మాటలు రావడం లేదు. ఆయన గురించి తలుచుకుంటేనే కన్నీరు ఊబికి వస్తోంది. ఆయనంటే నాకు అంత ప్రేమ. వీరంతా చెప్పినట్లు ఆయన ఎక్కడో లేరు, ఫిలిం ఛాంబర్ చుట్టూ స్టూడియో చుట్టూనే ఆయన తిరుగుతూ ఉంటారని నమ్ముతున్నాను. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News