Monday, December 23, 2024

మిల్లెట్ల పిండిపై జిఎస్‌టి తగ్గింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జిఎస్‌టిని తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రీప్యాకేజ్డ్ లేదా లేబుల్‌వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జిఎస్‌టి వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకు ముందు దీనిపై జిఎస్‌టి 28 శాతంగా ఉండేది.కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే ఎలాంటి జిఎస్‌టి వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం సమావేశం నిర్మలా సీతారామన్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదే సమావేశంలో మొలాసిస్‌పై జిఎస్‌టిని 5 శాతానికి తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం మొలాసిస్‌పై జిఎస్‌టి 28 శాతంగా ఉండగా దాన్ని 5 శాతానికి తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించింది.ఆల్కహాల్ ఉత్పత్తిలో ముడి పదార్థంగా ఉపయోగించే మొలాసిస్‌పై జిఎస్‌టిని తగ్గించడం వల్ల చెరకు రైతులకు మేలు చేకూరుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.అలాగే మానవ అవసరాలకోసం ఉపయోగించే డిస్టిల్డ్ ఆలహాల్‌ను జిఎస్‌టినుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట; సభ్యులర్రిఇష్ఠ వయోపరిమితిని నిర్ణయించారు. ఇకపై ట్రిబ్యునల్ చైర్మన్ గరిష్ఠ వయసు 70 ఏళ్లు , సభ్యుల వయసు 67 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వయోపరిమితి అధ్యక్షుడికి 67 ఏళ్లు, సభ్యులకు 65గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News