Thursday, January 23, 2025

మెడికల్ కాలేజీలకు 313 పోస్టులు మంజూరు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్‌కు వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను సృష్టించింది.

ఈ విద్యాసంవత్సరంలో ఒకేసారి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి రికార్డు సృష్టించిన ప్రభుత్వం, వచ్చే ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి,కొమురం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News