Sunday, January 19, 2025

రేపు ఆరు గ్యారంటీలపై రేవంత్ సంతకం చేస్తారా?

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్.. మొదటగా ఏ హామీపై సంతకం చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసినట్లు.. ఆరు గ్యారంటీలపై సంతకం పెడతారా? లేక ప్రభుత్వ ఉద్యోగాలు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి ఫైళ్లపై సంతకం చేస్తారా? అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఆరు గ్యారంటీలపైనే మొదటగా రేవంత్ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ హామీనే ప్రజలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. కాబట్టి ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
కాగా రేపు మధ్యహ్నం 1.04నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారాని పెద్ద ఎత్తున ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News