Monday, January 20, 2025

లాలూ ప్రసాద్‌తో పాటు ఇతరులపై సిబిఐ తాజా కేసు

- Advertisement -
- Advertisement -

Laloo Prasad

 

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరికి సంబంధించిన ‘ఉద్యోగం కోసం భూముల కుంభకోణం’కు సంబంధించిన తాజా కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం ఢిల్లీ, బీహార్‌లోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.  ఢిల్లీ, పాట్నా, బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లలో సోదాలు జరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. శ్రీ ప్రసాద్ 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్ కోసం భూమి పట్టాలు లంచాలు పుచ్చుకున్నారని ఆరోపణ.

ఆర్ జెడి  సీనియర్ నాయకుడు అలోక్ మెహతా మాట్లాడుతూ, “ఇది ప్రతిపక్షాన్ని అంతం చేయడానికి చేసిన ప్రయత్నం [సిబిఐ దాడి]. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది’’ అన్నారు. ఇటీవల లాలూ ప్రసాద్(73)కు  దాణా కుంభకోణం కేసుల్లో ఒకదానిలో బెయిల్ మంజూరు చేయబడింది.  3.5 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుండి అనారోగ్యంతో ఉన్న శ్రీ ప్రసాద్ న్యూఢిల్లీలోని తన పెద్ద కుమార్తె , పార్టీ రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News