Monday, December 23, 2024

వాలంటీర్ల దరఖాస్తుకు ఆహ్వానం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: 2023-24, 2024-25 సంవత్సరానికి గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువతీ యువకుల నుండి నెహ్రు యువ కేంద్ర కరీంనగర్, వాలంటీర్లకు గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఎం వెంకట్ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు తేది 1-4-23 నాటికి 18 సంవత్సరాలు నిండి 29 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. కనీస విద్యార్హత పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు రెగ్యులర్‌గా చదువుతున్న వారై ఉండరాదని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులకు అన్ని కలుపుకుని గౌరవ వేతనం రూ. 5 వేలు నెలకు ఇవ్వబడుతుందని అన్నారు. నెహ్రు యువ కేంద్ర అనుబంధ యువజన సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు యువజన సంఘాల స్థాపన, క్రీడలు, ఆరోగ్యం, పారిశుద్ధం వివిధ సామాజిక అంశాలపై యువతను చైతన్యపర్చాల్సిన ఉంటుందన్నారు. దరఖాస్తు చేయు విధానం ఆన్‌లైన్ పద్దతి ద్వారా www.nyks.nic.in. సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుకు చివరి తేది 24-3-23 అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News