Thursday, January 23, 2025

సమస్యలు పరిష్కరించాలి… మంత్రి సత్యవతికి అంగన్‌వాడీ టీచర్ల వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు రాష్ట్ర గిరిజన, మహిళా -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం డా.బి.ఆర్ అంబెడ్కర్ సచివాలయంలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అంగన్ వాడిల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సంధ్య, ఉపాధ్యక్షురాలు నందిని తదితరులు మంత్రిని కలిశారు. వారి వినతిని సావధానంగా విన్న మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ నిచ్చారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడి టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, అందుకు కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ కోణంలో ప్రభుత్వ పథకాలకు అర్హతలు మార్చడంతో పాటు, మినీ అంగన్‌వాడి కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని కొనియాడారు. అంగన్‌వాడీ టీచర్లను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలన్నదే తమ అబిమతమని వారు పేర్కొన్నారు. అయితే కొన్ని యూనియన్లు పనిగట్టుకుని సమ్మె సంకేతాలు ఇస్తున్నాయని, అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఎవరు ఆ కార్యక్రమాలకు వెళ్లడం లేదని మంత్రి విన్నవించారు. ఏలాంటి ఆందోళనలు, నిరసనలు లేకుండానే వినతిపత్రల ద్వారా తమ సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతగా ఉంటామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News