Friday, January 24, 2025

సింగపూర్ ఓపెన్.. సింధు, సైనా శుభారంభం

- Advertisement -
- Advertisement -

సింధు, సైనా శుభారంభం
శ్రీకాంత్‌కు మంజునాథ్ షాక్,
సింగ్‌పూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: ప్రతిష్టాత్మకమైన సింగపూర్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో మిథున్ మంజునాథ్, హెచ్‌ఎస్.ప్రణయ్‌లు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. అయితే స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. భారత్‌కే చెందిన మిథున్ మంజునాథ్ చేతిలో శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మిథున్ తొలి రౌండ్‌లో 2117, 1521, 2118 తేడాతో శ్రీకాంత్‌పై సంచలన విజయం సాధించాడు. దాదాపు గంటపాటు హోరాహోరీగా సాగిన పోరులో మిథున్ జయకేతనం ఎగుర వేశాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 2113, 2116 తేడాతో థాయిలాండ్‌కు చెందిన థమ్మాసిన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ప్రణయ్ సునాయాసంగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సింధు జయకేతనం ఎగుర వేసింది. తొలి రౌండ్‌లో బెల్జియం షట్లర్ లియానె టాన్‌ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడును కనబరిచిన సింధు2115, 2111 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. తొలి రౌండ్‌లో సైనా భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్‌ను ఓడించింది. నిలకడైన ఆటను కనబరిచిన సైనా 2118, 2114 తేడాతో జయకేతనం ఎగుర వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News