Monday, December 23, 2024

సిఎల్‌పి భేటీని బహిష్కరించిన జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana Congress,CLP meeting,Revanth reddy, Jagga Reddy,Hyderabad, Hyderabad News,

కాంగ్రెస్‌లో మళ్లీ
బయటపడ్డ విభేదాలు

మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా సిఎల్పీ భేటీ నుంచి అ ర్థాంతరంగా బయటికొచ్చారు. ములుగు ఎం ఎల్‌ఎ సీతక్క కూడా సమావేశం మధ్యలో నుం చే వెళ్లిపోయారు. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావించేందుకు భేటీలో అవ కాశం ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమకుమార్ సూచించిన ట్లు పేర్కొన్నారు. అందుకే భేటీ నుంచి వెళ్లిపో తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కా నుండడంతో సభలో లెవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు సిఎల్పీ భేటీ అయ్యింది.

హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని జగ్గారెడ్డి ఆయనపై ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి.. స్థానిక ఎంఎల్‌ఎ అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వనప్పుడు సిఎల్పీ భేటీలో ఉండటమెందుకని బయటికొచ్చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని.. ఎంఎల్‌ఎగా అది తన హక్కు అని పేర్కొన్నారు. కాగా, సీఎల్పీ భేటీకి కొద్ది గంటల ముందు జగ్గారెడ్డి మీడియా సమావేశానికి సిద్ధపడగా కాంగ్రెస్ పెద్దలు వారించడంతో ప్రెస్‌మీట్‌ను విరమించుకున్నారు. ఆ తర్వాత నేరుగా తాజ్ డెక్కన్ హోటల్‌కు వెళ్లిన ఆయన అక్కడ అరగంట పాటు ఉన్నట్లు సమాచారం.
జగ్గారెడ్డి ఎందుకు బయటికి వెళ్లారు… సిఎల్పీ మీటింగ్‌లో సంపత్‌కుమార్ కామెంట్స్

సిఎల్పీ సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు డిసిసి అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ కీలక అంశాలను లేవనెత్తారు. హైదరాబాద్‌లో సిఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు మెదక్‌లో రేవంత్‌రెడ్డి టూర్ నిర్వహించారని ఆయన చెప్పారు. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు నిర్వహించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎల్పీ సమావేశానికి వచ్చిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎందుకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో మన స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలని కూడా ఆయన అడిగారు.

విభేదాలు పక్కన పెట్టాలి ః ఎంఎల్‌ఎ సీతక్క

కాంగ్రెస్‌లో అందరూ విభేదాలు పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేయాలని ములుగు ఎంఎల్‌ఎ సీతక్క అన్నారు. సిఎల్పీ సమావేశానికి హాజరై ఆమె పలు అంశాలపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు నివేదికను అందజేసినట్లు తెలిపారు. మాజీ టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సిఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చాలా మంది నేతలు కూడా ప్రజా సమస్యలను సిఎల్పీ దృష్టికి తీసుకువచ్చారని సీతక్క పేర్కొన్నారు. తనకు ఇతర పార్టీ కార్యక్రమాలు ఉండటంతో సమావేశం మధ్యలోనే వెళ్తున్నట్లు చెప్పారు. ఇతర కార్యక్రమాలు ఉండడం వల్లే చాలా అంశాలపై సిఎల్పీ నేతకు నివేదిక ఇచ్చాను. చాలా మంది నేతలు అనేక ప్రజా సమస్యలను సిఎల్పీ దృష్టికి తెచ్చారన్నారు. పార్టీ కార్యక్రమాలు ఉండటం వల్ల సమావేశం మధ్యలోనే వెళ్తున్నానని, పార్టీలోని అందరు నాయకులు విభేదాలు పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేయాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News