Friday, December 20, 2024

‘స్క్రీన్’ మ్యాగజైన్ రీలాంచ్!

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తన ప్రతిష్ఠాత్మక ‘స్క్రీన్’ మ్యాగజైన్ ను శుక్రవారం ముంబైలో తిరిగి ఆరంభిస్తోంది. ఈ రీలాంచ్ దాదాపు 11 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఇప్పుడు విడుదలయ్యే మ్యాగజైన్ ముఖ చిత్రంపై నటి శ్రద్ధా కపూర్ (స్త్రీ2 ఫేమ్) కనిపించబోతున్నారు. దీని తాలూకు ‘గాలా ఈవెంట్’ లో దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ, ప్రముఖ నటులు విక్రాంత్ మాస్సే, విజయ్ వర్మ కూడా  చర్చలో పాల్గొనబోతున్నారు.

‘స్క్రీన్’ మ్యాగజైన్ 1949 నుంచి భారతీయ సినిమా రంగం విశేషాలను అందిస్తూ వచ్చింది. దశాబ్దాలుగా భారతీయ సినిమా విశేషాలను పంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మ్యాగజైన్ తిరిగి మార్కెట్ లోకి రాబోతున్నది.

 

Screen

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News