Monday, December 23, 2024

‘హాయ్ నాన్న’ సినిమా ఆ లోటుని తీరుస్తుంది

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమవుతూ రూపొందిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషించారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ‘హాయ్ నాన్న’ గురువారం గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హీరో నాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “హాయ్ నాన్న చాలా హ్యాపీ ఫిల్మ్.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నవ్వులతో బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే భావోద్వేగం ఉంటుంది. హాయ్ నాన్న అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైసీని పంచాయి. అయితే స్వీట్ ని ఇచ్చే సినిమాలే లేవు. హాయ్ నాన్న సినిమా ఆ లోటుని తీరుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ సంగీతంలో 90లలోని రెహ్మాన్ ఫ్లేవర్ వుంటుంది. ఇలాంటి లవ్ స్టొరీకి హేషమ్ లాంటి ఫ్లేవర్ చక్కగా కుదురుతుందని ఆయన్ని ఎంపిక చేశారు.

పాటలకు అద్బుతమైన స్పందన వచ్చింది. నేపధ్య సంగీతం కూడా ఎక్స్ ట్రార్డినరీగా చేశాడు. యష్ణ పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించింది. తన నటన కట్టిపడేస్తుంది. బేబీ కియారా సూపర్ కిడ్. తన నటన మనసుని హత్తుకునేలా వుంటుంది. ఎవరైనా నన్ను ఫ్యామిలీ హీరో అన్నప్పుడు ఆనందంగా వుంటుంది. వెంకటేష్‌తో మాట్లాడుతున్నపుడు కూడా ఇదే టాపిక్ వచ్చింది. ఆయన తర్వాత ఫ్యామిలీ హీరోగా నన్ను చూస్తారని చెప్పారు. అయితే నేను అన్ని రకాల చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. ఒక్క ఇమేజ్ లోనే వుండిపోకుండా కొత్తదారుల్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News